Wednesday, May 1, 2024

ఓటిటిలోకి భూతద్దం భాస్కర్, ఆపరేషన్ వాలెంటైన్ మూవీలు

- Advertisement -
- Advertisement -

ఇటీవలే విడుదలైన రెండు మూవీలు ఒకే రోజున ఓటిటిలోకి వచ్చేశాయి. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీలోకి వచ్చేసింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్, మనీషా చిల్లర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్లలో రిలీజైంది. మిక్స్ డ్ టాక్ తో అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. పుల్వామా, బాలాకోట్ దాడుల నేపథ్యంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఆపరేషన్ వాలెంటైన్..తాజాగా శుక్రవారంనుంచీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి వచ్చిన మరో సినిమా- భూతద్దం భాస్కర నారాయణ. పురుషోత్తంరాజ్ దర్శకత్వంలో శివ కందుకూరి హీరోగా నటించిన ఈ మూవీ కూడా మార్చి1నే విడుదలైంది. చక్కటి థ్రిల్లర్ గా పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ శుక్రవారంనుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ మొదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News