Wednesday, May 1, 2024

నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన మూడు భారతీయ శిక్షాస్మృతి బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తమ ఆమోదం తెలిపారు. వీటిపై రాష్ట్రపతి సంతకాలతో కొత్త బిల్లులు ఇప్పుడు చట్టరూపాన్ని సంతరించుకుంటాయి. దీనికి అనుగుణంగా దేశంలో నేరం శిక్ష సంబంధిత విధివిధానాలు దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత , భారతీయ సాక్షా యాక్ట్ బిల్లులతో పాటు టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 బిల్లుకు కూడా ఆమోద ముద్రపడింది. పార్లమెంట్ శీతాకాల సెషన్‌లో విపక్ష ఎంపిలపై సామూహిక సస్పెన్షన్ల తరువాతి దశలో ఈ కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం దక్కింది. ఈ బిల్లులకు రాష్ట్రపతి నుంచి సమ్మతి లభించిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వేర్వేరుగా నిర్థారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News