మనతెలంగాణ/పరిగి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో దేశం అభివృద్దిలో దూసుకపోతుందని బిజేపి మండల పార్టీ అధ్యక్షురాలు నీరటి అనుసూయ శ్యామ్ అన్నారు. పరిగి మండల పరిధిలోని మిట్టకోడూరు, గోవిందాపూర్ గ్రామ పంచాయతీలలో బుధవారం మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడు తేని విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని చెప్పారు. పదేళ్లుగా భారత్ ప్రపంచ దేశాలకు ధీటుగా వృద్ది రేటు సాధించిన మోడీ ముందు చూపుకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థలలో బీజేపీ అభ్యార్థులను గెలుపించాలని పిలుపినిచ్చారు. గ్రామాలో అభివృద్ది బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు.
గ్రామాలలో అభివృద్దికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తుందన్నారు. పథకాలన్ని కాంగ్రెస్ నాయకులకే దక్కుతున్నాయని ఆరోపించారు. అదే క్రమంలో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం మోడీ నేతృత్వంలో అనేక చట్టాలను ప్రజల అకాంక్షల మేరకు రూపోందిస్తుదన్నారు. దేశంలో అనేక ఏళ్లుగా అపరిష్రృతంగా ఉన్న సమస్యలను ఒకోక్కటిగా పరిస్కరిస్తున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు జంగయ్య, మల్లయ్య, ఆనంద్, మహేష్, వెంకటేష్, మైపాల్, శ్రీనివాస్, అంజి, తదితరులు పాల్గొన్నారు.