Sunday, April 28, 2024

బిజెపికి షాక్… టిఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ఎన్నికలలో ఓడిపోయినా ప్రజాసేవలోనే ఉన్నానని శ్రీధర్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఎన్నికల ముందు బిజెపికి మరో షాక్ తగిలింది. బిజెపి అధికారి ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఎంఎల్‌ఎగా పోటీ చేసి మోడీ ప్రభుత్వం పూర్తి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా బిజెపి అనసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. కేంద్రం రైతు చట్టాలు తెలంగాణ రైతులకు శాపంగా మారాయన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్‌లో పని చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌తోనే సాధ్యమవుతోందన్నారు.

నిజాయితీ గల బిజెపి నేతలు, కార్యకర్తలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు టిఆర్‌ఎస్ పాలనతోనే న్యాయం జరుగుతోందన్నారు. పేదలు, రైతులకు చేయాలనుకున్న సేవ టిఆర్‌ఎస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కల్లబొల్లి మాటలు, సోషల్ మీడియాలో అబద్దాల ప్రచారంతో బిజెపి నెట్టుకొస్తుందని దుయ్యబట్టారు. కార్యకర్తలకు అవసరమొచ్చినప్పుడు బిజెపి నేతలు ముఖం చాటేస్తున్నారన్నారు. చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆదుకుంటున్నారని తెలియజేశారు. తన శక్తివంచన లేకుండా టిఆర్‌ఎస్ కోసం పని చేస్తానని వివరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నుంచి శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News