Thursday, May 2, 2024

బట్టతలను దాచిన నవ వరుడిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered on groom with bald head
ముంబయి: బట్టతల ఉన్న సంగతి దాచిపెట్టి తనని పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై ఓ యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చార్టర్డ్ ఎకౌంట్ (29) గత నెలలో పెళ్లి జరిగింది. పెళ్లి చూపులకు, వివాహ సమయంలో చార్టర్డ్ ఎకౌంట్ వింగ్ పెట్టుకొని వచ్చాడు. పెళ్లైన నెల రోజుల తరువాత అతడికి బట్టతల ఉందని అమ్మాయి గుర్తించింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో నవ వరుడిపై నవ వధువు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తనని వేధిస్తున్నారని, తన ఫోన్‌ని హ్యాక్ చేసి కాల్ రికార్డు చేస్తున్నాడని వాట్సాప్‌లో చాటింగ్‌లను చెక్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News