Tuesday, April 30, 2024

అసెంబ్లీకి జితేందర్ రెడ్డి, పార్లమెంట్‌కు శాంతకుమార్ ?

- Advertisement -
- Advertisement -

పాలమూరుపై బిజెపి ప్రధాన ఫోకస్
లైన్ క్లియర్ చేసిన బాజాపా అధిష్టానం
త్వరలో ప్రకట చేయనున్న హైకమాండ్

మహబూబ్‌నగర్: పాలమూరు అసెంబ్లీపై ప్రధానంగా దృష్టిసారించిన బిజెపి ఎట్టకేలకు ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ అభ్యర్ది, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎవరిని పోటీకి దింపాలని గత కొన్ని నెలలుగా తర్జన భర్జనల తర్వతా బిజెపి అధిష్టానం చివరికి మాజీ ఎంపి జితేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎపి జితేందర్ రెడ్డి ఎన్‌డిఎ హాయంలో బిజెపి నుంచి ఒకసారి 2014 లో టిఆర్‌ఎస్ నుంచి రెండో సారి ఎంపిగా విజయం సాధించారు. రాజకీయ అనుభవం, పాలమూరు పట్టణంలో ఆయనకు ఉన్న క్యాడర్ దృష్టా పార్టీ ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

నామినేషన్ల ఏర్పాటుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని పార్టీ సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటి నుంచో పార్టీ కోసం పని చేస్తూ వస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌కు ఎంపి టికెట్ పై పార్టీ కేంద్ర హైమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎవరి ఏర్పాట్లు వారు చేసుకోవాలని పార్టీ ఆదేశించినట్లు తెలిసింది. ఎపి జితేందర్‌రెడ్డి మొదటి నుంచి షాద్ నగర్ నుంచి తన కుమారుడు మిథన్‌రెడ్డికి టికెట్ అడుగుతున్నారు. తనకు లేక పోయినా తన కుమారుడికి టికెట్ కావాలని జితేందర్ రెడ్డి ఎక్కవ పట్టుబట్టినట్లు సమాచారం. అయితే అధిష్టానం మాత్రం పాలమూరు బరిలో జితేందర్‌రెడ్డికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

షాద్‌నగర్ విషయంలో మిథున్‌రెడ్డికి ఇస్తారా లేక వేరే వారికి ఇస్తారా అన్నది ఇంకా పార్టీ క్లారిటి రానట్లు తెలుస్తోంది. ఇటీవలనే పాలమూరు ప్రజా గర్జన పేరుతో పాలమూరు జిల్లాలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతమైందనే చెప్పాలి. దీంతో బీజేపీలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. అప్పటి వరకు బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటే అన్న ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పటాపంచలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడంతో పాటు రాఇజకీయంగా చాల ఘాటైన విమర్శలు చేశాడు.

దీంతో బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటి కాదనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం జరిగింది. సభ విజయవంతం కావడంతో ముఖ్యంగా పాలమూరు నియోజకవర్గంపై బిజెపి పోకస్ పెట్టింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి చేపట్టిన అభివృద్దిని ఎదుర్కొనేందుకు బిజెపి కొత్త అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. కేంద్రం నుంచి మంజూరైన రెండు జాతీయ రహదారులు వచ్చాయి, పేదలకు ఉచిత బియ్యం, ఉజ్వల కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ వంటి పథకాలతో పాటు బిజెపి మెనుఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని ఆ పార్టీ భావిస్తోంది.

పార్లమెంట్‌కు శాంతకుమార్
బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర కోశాధికారి, బిసి నేతగా ఉంటూ చాలా కాలం పార్టీ కోసం పని చేస్తున్న శాంతకుమార్‌కు మహబూబ్ నగర్ పార్లమెంట్ బరిలో పోటీ చేయాలని కేంద్ర హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు శాంతకుమార్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేసుకోవాలని సూచించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బిజెపిలో కూడా బిసిలకు అన్యాయం జరుగుతోందన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బిసి సామాజిక వర్గం నుంచి శాంతకుమార్‌కు అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తోంది.

గతంలో కూడా శాంతకుమార్‌కు పార్లమెంట్ టికెట్ ఖరారు అవుతుందన్న సందర్భాల్లోనూ ఆయనకు చివరి నిమిషంలో కలిసి రాలేక పోయింది. మొదటి సారి నాగం జనార్దన్ రెడ్డి, రెండవ సారి డికె అరుణ బిజెజి నుంచి పార్లమెంట్ బరిలో నిలబడడంతో శాంతకుమార్‌కు టికెట్ దక్కలేదు. అయితే ఈ సారి ఖచ్చితంగా శాంతకుమార్‌కు అవకాశం కల్పించాలని పార్టీ స్థిర నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పాలమూరు పార్లమెంట్ బరిలో కూడా బిసిలు ఎక్కవగా ఉండడంతో పాలమూరు ఎంపి టికెట్ బిసి అయిన శాంతకుమార్‌కు టికెట్ ఇస్తే బాగుంటుందనే లక్షంతోనే ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News