Wednesday, May 22, 2024

రాసిపెట్టుకోండి.. బిజెపి రెండంకెలు దాటదు

- Advertisement -
- Advertisement -

BJP will not cross double-digit in West Bengal Assembly elections

 

ప.బెంగాల్ వేరు ఇతర రాష్ట్రాలు వేరు
నా జోస్యం తప్పనితేలితే ట్విటర్ నుంచి వైదొలుగుతా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

కొల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి రెండంకెల సీట్ల బలాన్ని దాటలేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. రాష్ట్రంలో బిజెపికి అంత సీన్ లేదని , విజయంపై ఇప్పుడే ఆ పార్టీ నేతల హంగామా ఎందుకో అర్థం కావడం లేదని కిషోర్ స్పందించారు. బెంగాల్‌లో బిజెపి అనుకూల గాలి ఉందని, తమ పార్టీ 200 సీట్లకు పైగా గెల్చుకుంటుందని హోం మంత్రి అమిత్ షా చెప్పడంపై సోమవారం ప్రశాంత్ కిషోర్ దీటుగా స్పందించారు. అమిత్ షా చేపట్టిన భారీ స్థాయి ఫిరాయిపులతో ఫలితం ఏదీ ఉండదని ప్రశాంత్ కిషోర్ తేల్చిచెప్పారు. వీటిని లెక్కలోకి తీసుకోవల్సిన అవసరం లేదని, బెంగాల్ వేరు ఇతర రాష్ట్రాల తీరు వేరని రాజకీయ వ్యూహాలలో స్టంట్‌మాస్టర్ పేరు తెచ్చుకున్న ప్రశాంత్ తెలిపారు. వచ్చే ఏడాది ఎప్రిల్ మే మధ్యలో ఎప్పుడైనా జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్త ఆసక్తి నెలకొంది.

ఇక్కడ మమత బెనర్జీ ఆహ్వానం మేరకు కిషోర్ టిఎంసి తరఫున ఎన్నికల విజయావకాశాల సమన్వకర్త బాధ్యత తీసుకున్నారు. పది నుంచి 20 కి మించి బిజెపికి సీట్లు వస్తే తాను ట్విట్టర్ నుంచి వైదొలుగుతానని, ఇది తన సవాల్ అన్నారు. బెంగాల్‌లో ఇప్పుడే ఏదో జరిగిపోతుందనేది బాకా మీడియా సృష్టి అని, తన విశ్లేషణ ప్రకారం బిజెపి బాగా కష్టపడితే రెండంకెలు కూడా దాటబోదని, క్షేత్రస్థాయి వాస్తవికత ఈ విధంగా ఉందని తెలిపారు. బిజెపి వారు బుడగలు సృష్టించుకున్నారు. వీటిపై ఊహలు అందలం ఎక్కుతున్నాయంతే అన్నారు. వాపు బలుపు కాదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాను ట్వీట్ చేస్తున్నది భద్రపర్చుకోవాలని, ఇది తప్పితే ఇకపై తాను ఈ వేదికపై కన్పించబోనన్నారు.

పాపం ప్రశాంత్‌కు అశాంతే

ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. బెంగాల్ ఎన్నికలలో ఫలితం ఏ విధంగా ఉంటుందనేది ఆయనకు తెలిసిరావడం లేదని,ఏదేమైనా ఇప్పుడు స్వీయ సవాల్ విసురుకున్న ప్రశాంత్ వైఖరితో బెంగాల్ ఎన్నికల తరువాత దేశం ఓ ఎన్నికల వ్యూహకర్తను కోల్పోతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ స్పందించారు. ఇప్పటి నుంచే ఆయన తన ట్విట్టర్ ఖాతా మూతకు సిద్ధం అయితే మంచిందన్నారు. బెంగాల్‌లో బిజెపి సునామీ ఆయన దృష్టికి రానట్లుందన్నారు. కేంద్ర మంత్రి బాబుల్ సు్రప్రియో తమ ట్వీటులో స్పందిస్తూ ‘ ఆయనకు టిఎంసి ఎటువంటి తిండిపెడుతున్నదో తెలియదు కానీ విచిత్రంగా మాట్లాడుతున్నాడు. 2021 రానివ్వండి ఎన్నికలు కానివ్వండి . ఆ నాగుపాము (టిఎంసి ) ఉండదు, ఈ పికె నాగస్వరమూ ఊదడమూ ఉండదు’ అని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News