Thursday, May 2, 2024

తన ఆఫీసు కూల్చివేతపై కంగనా ఫైర్

- Advertisement -
- Advertisement -

BMC demolishes Kangana Ranaut office

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. హిమాచల్ నుంచి ముంబై బయల్దేరిన కంగనాకు మహా సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. ఆమె ఆఫీస్ కూల్చివేతతో కంగనాకు స్వాగతం పలికింది. జెసిబిలతో ఆఫీస్ ముందు బాగాన్ని తొలగిస్తున్నారు. అనుమతి లేకుండా ఆఫీసులో మార్పులు చేశారంటూ బిఎంసి అధికారులు ఆమెకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో బంగ్లా గేట్ కు నోటీసులు అంటించింది. కూల్చివేతపై కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించింది. తన ఆఫీస్ కూల్చివేతపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆఫీసును రామాలయంతో పోల్చిన కంగనా.. ముంబైని మరోసారి పివొకేతో పోల్చింది. బాబర్ రామాలయాన్ని కూల్చివేసినట్టు ఆఫీసును కూల్చివేస్తున్నారని వాపోయింది. బిఎంసి బాబర్ ఆర్మీలా తయారైందని మండిపడింది.తన కార్యాలయ కూల్చివేతను నిలిపివేయాలంటూ కంగనా వేసిన పిటిషన్ ను పరిశీలించిన ముంబై హైకోర్టు కూల్చివేతపై స్టే విధించింది.

 

https://twitter.com/KanganaTeam/status/1303572126817857536

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News