Tuesday, May 7, 2024

18 ఏళ్లు పైబడ్డ వారికీ బూస్టర్ డోస్‌లు?

- Advertisement -
- Advertisement -

Booster doses for those over 18 years of age

వేరియంట్ల దశలో కేంద్రం యోచన

న్యూఢిల్లీ : దేశంలోని యువతకు కరోనా బూస్టర్ డోస్‌లు త్వరలోనే అందనున్నాయి. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ ఈ మూడో లేదా బూస్టర్ టీకా పడేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని దేశాలలో తిరిగి కరోనా సరికొత్త వేరియంట్లు తలెత్తడం, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేయడం, రాకపోకలు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో యువతను పరిగణనలోకి తీసుకుని సురక్షితంగా వారు ఉండేందుకు బూస్టర్ షాట్‌ల పరిధిలోకి వారిని చేర్చాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆలోచిస్తోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ సంబంధిత ఈ అంశంపై తుది కీలక నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. దేశంలో రెండు డోసుల టీకాల ప్రక్రియ తరువాత వేరియంట్లను పరిగణనలోకి తీసుకుని మూడో షాటు కార్యాచరణకు దిగారు.

ఇందులో భాగంగానే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 60 ఏండ్ల పైబడ్డ వారు, ఆరోగ్య పరిరక్షణ, క్షేత్రస్థాయి పారిశుధ్య ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఈ మూడో డోస్ పొందుతున్నారు. అమెరికా ఇతర దేశాల్లో బూస్టర్ డోస్‌లకు ప్రాధాన్యత ఉంది. రెండో డోస్ తీసుకున్న తరువాత తొమ్మిది నెలలు లేదా 39 వారాల వ్యవధిలో బూస్టర్ డోస్ రంగం సిద్ధం అయింది ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలను , ఆంక్షల ఎత్తివేతలను పరిగణనలోకి తీసుకుని బూస్టర్ డోస్ పరిధిని యువతకు కూడా వర్తింపచేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ నెల 16వ తేదీ నుంచే 1214 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి కూడా టీకాలు వేసే ప్రక్రియ ఆరంభం అయింది. దశలవారిగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గత ఏడాది జనవరి 16 వ తేదీన ఆరంభం అయింది. వయస్సు, రోగ లక్షణాలు వంటి పలు అంశాలను వైద్యపరమైన శాస్త్రీయ విశ్లేషణల క్రమంలో ఈ టీకా కార్యక్రమం సాగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News