Sunday, May 5, 2024

దేశానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Bringing fame to country: Srinivas Goud

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో క్రీడల అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నామని  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి కుమారి ఇషా సింగ్ ఇటీవల పెరు దేశంలోని లిమా పట్టణంలో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్స్ షిప్ లో వ్యక్తి గత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ , 50 మీటర్ల ప్రీ పిస్టోల్ విభాగంలో రజత పతకాలను సాధించిన సందర్భంగా ఆమెను శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. గత 6, 7 సంవత్సరాల నుండి క్రీడల అభివృద్ది కి, క్రీడాకారులను , కోచ్ లను ప్రోత్సహించడం ద్వారా క్రీడా రంగంలో పలితాలు వస్తున్నాయన్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రతిభను కనబరస్తూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారన్నారు. అందులో భాగంగా ఇషా సింగ్ షూటింగ్ క్రీడలో దేశంలో , ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి గా రాణిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ క్రీడా హబ్ గా మారుతుందని ప్రశంసించారు.

తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ క్రీడాభివృద్ది కోసం షూటింగ్ రెంజ్ ఏర్పాటు కోసం ఒలంపియన్ గగన్ నారంగ్ కు గచ్చిబౌలి లో అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. మన రాష్ట్రానికి చెందిన ఇషా సింగ్ ఇటీవల పెరూ దేశంలోని లిమా నగరంలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో వ్యక్తి గత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టోల్ విభాగంలో సిల్వర్ పతకం, వ్యక్తి గత విభాగంలో 50 మీటర్ల విభాగంలో ప్రీ పిస్టోల్ విబాగంలో సిల్వర్ మెడల్ సాదించిన అతి చిన్న వయస్కురాలు ఇషా సింగ్ అని కొనియాడారు. భవిష్యత్ షూటింగ్ లో దేశానికి ఆషాకిరణం గా నిలువబోతుందన్నారు. కుమారి ఇషా సింగ్ షూటింగ్ క్రీడా విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి , దేశానికి పేరు ప్రఖ్యాతులను తీసుకవచ్చారని కొనియాడారు.

ఇషా సింగ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలైన ఖతర్ లోని దోహా పట్టణంలో జరిగిన 14 వ ఏషియన్ చాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలు సాధించారన్నారు. 2019 – తైవాన్ లో 12 వ ఏయిర్ గన్ చాంపియన్ షిప్ లో జూనియర్ విభాగంలో బంగారు పతకం, 2019 లో నేపాల్ లోని ఖాడ్మండ్ లో జరిగిన ఎస్ఎఎఫ్ గేమ్స్ లో బంగారు పతకం, 2019 లో జర్మనీ లోని హనోవర్ లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ పోటిలలో 10 మిటర్ల ఏయిర్ పిస్టోల్ విభాగంలో సిల్వర్ మెడల్ ను సాదించారని పొగిడారు. 2019 లో జర్మనీ లో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ లో 10 మిటర్ల విభాగంలో రజతం, కాంస్యం పతకాలను సాదించారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రెండు శాతం రిజర్వేషన్లు , 0.5 శాతం ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి, క్రీడా పాలసీని రూపొందించటానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాబినేట్ సబ్ కమీటి ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ది కోసం దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని క్రీడా శాఖ త్వరలోనే రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో క్రీడ మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా ప్రతి నియోజక వర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు నగదు పురాస్కారాలను పెంచామని,  తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా రూపొందిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఇషా సింగ్ , ఇషా సింగ్ తండ్రి సచిన్, ఎస్ఎటిఎస్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, షూటింగ్ అసోసియేషన్ సెక్రెటరీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News