Sunday, December 3, 2023

కరోనా తగ్గిన… భయపెడుతున్న సీజనల్ వ్యాధులు

- Advertisement -
- Advertisement -
Seasonal diseases rise in Hyderabad
వర్షాలతో ముప్పు తప్పదంటున్న వైద్యులు
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
డెంగీ, మలేరియా, విరేచనాలతో జనం ఆసుపత్రుల బాట
జీహెచ్‌ఎంసీ ఫాగింగ్ చేసి,చెత్త లేకుండా చేయాలంటున్న స్థానికులు

హైదరాబాద్: నగరంలో కరోనా కేసులు నాలుగు నెలల నుంచి తగ్గుముఖం పట్టిన కురుసున్న వర్షాలకు సీజనల్ వ్యాధుల ప్రజలపై విరుచుకపడుతున్నాయి. ఏ ఇంట్లో చూసిన మలేరియా, డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారు. విష జ్వరాలకు విరుగుడుగా పేరుగాంచిన నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి జ్వరాల రోగులతో నిండిపోతుందంటున్నారు. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నగర ప్రజలు వివిధ రకాల విష జ్వరాలతో మంచం పడుతారని, ఇటీవల కురిసిన వర్షాలకు దోమలు విజృంభణ చేసి, ప్రజలపై దాడి చేస్తే డెంగీ, మలేరియా, విరేచనాలు వంటి రోగాల బారినపడే పరిస్దితి ఉందని హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం జ్వరానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే సమీపంలోని బస్తీదవఖానలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో చెత్తా చెదారం ఎక్కడిక్కడే పేరుకుపోవడంతో దోమలు పెరుగుతున్నట్లు, స్థానిక మున్సిఫల్ అధికారుల ఫాగింగ్ చేయకపోవడంతో రోడ్లపై నీరు నిల్వడంతో కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని స్దానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది రెండు నెల నుంచి నగరంలో 1500 డెంగ్యూ, 3100 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో 224 బస్తీ దవాఖానలు, 56 పట్టణ అర్బన్ కేంద్రాలు ఉన్న వాటిలో రోజుకు సుమారుగా 60 నుంచి 80మందికి వైద్యం అందించినట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. అక్కడ రోగుల సంఖ్య పెరిగితే ఫీవర్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సకాలంలో చికిత్సలు అందించేలా చూడాలని వైద్యులు కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల వస్తే సాధారణ జ్వరం, మూడు రోజ్లులో తగ్గుతుంది, ముక్కునుంచి నీరు కారుట, కఫంతో కూడిన దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. గొంతునొప్పి ,కండ్లు ఎర్రబడుట,వాంతులు విరేచనాలు ఉంటాయని వివరిస్తున్నారు.

దోమల వ్యాప్తితోనే విషజ్వరాలు:  వైద్యాధికారులు

నగరంలో కురుస్తున్న వానలకు రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పాటు, చెత్త ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలను కంటిమీద కునుకు లేకుండా కాటు వేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఫాగింగ్ చేయడంతో పాటు, చెత్తను ఎప్పటికప్పడు తొలగిస్తే ప్రజలకు సోకకుండా కాపాడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News