Friday, May 3, 2024

వైరస్ రీ ఎంట్రీ… మరోదారి లేదు

- Advertisement -
- Advertisement -

వైరస్ రీ ఎంట్రీ …మరోదారి లేదు
బ్రిటన్‌లో తిరిగి లాక్‌డౌన్….ఈసారి కట్టుదిట్టం

Britain Imposes lockdown for 2nd Wave of Corona

లండన్: యూరప్ దేశాలలో తిరిగి కరోనా మహమ్మారి విజృంభించింది. ఇప్పటికే ఫ్రాన్స్‌లో పలు ప్రాంతాలలో కరోనా రెండోదశ తీవ్రతతో వ్యవధి ఇవ్వకుండానే లాక్‌డౌన్ విధించారు. ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటన్‌లోనూ లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. తొలిదశ కరోనాతోపోలిస్తే రెండో సారి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. స్వయంగా కోవిడ్ కాటుకు గురైన ప్రధాని వెంటనే అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి వేరే మార్గం లేకపోవడంతో లాక్‌డౌన్‌ను విధించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నిర్ణయం గురువారం నుంచి అమలులోకి వస్తుంది. కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. అంతా ఇక ఇంటికే పరిమితం కావాల్సి ఉంది. వ్యాయామం, సరైన చికిత్స అవసరం, సముచిత ఆహారం తీసుకోవాలి. ఉద్యోగాలకు, చదువులకు అవసరం అయితే విధిగా రావాల్సి ఉన్నా సరైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ప్రధాని పౌరులకు పిలుపు నిచ్చారు. నిత్యావసర వస్తువుల కోసం తప్ప బయటికి రావద్దు అని సూచించారు. పబ్బులు, రెస్టారెంట్ల బార్లు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా మూసివేయాల్సి ఉంటుంది.

అయితే, విద్యాసంవత్సరం దెబ్బతినకుండా ఉండేందుకు కాలేజీలు, స్కూళ్లు, యూనివర్శిటీలను తెరిచేఉంచుతారని ప్రధాని తెలిపారు. ప్రజలంతా సహకరిస్తే, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తే వచ్చే క్రిస్మస్ నాటికి పరిస్థితి చక్కబడి, తిరిగి వీధులన్ని కళకళలాడుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రజల సమిష్టిత్వం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఇంగ్లండ్‌లో రోజుకు 20 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి పట్ల దేశ ఆరోగ్య శాఖాధికారులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాప్తిని అడ్డుకోకపోతే మరణాల రేటు పెరుగుతుందని తెలిపారు. ఇప్పుడు చలికాలం కావడంతో వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుంది. పైగా వెంటనే కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సరైన వ్యాక్సిన్ చికిత్సా విధానాలు అందుబాటులోకి రాకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతుందని విశ్లేషించారు. బ్రిటన్‌లో ఇప్పటివరకూ పదిలక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 24 గంటల వ్యవధిలోనే 21వేలకు పైగా మందికి కరోనా సోకింది. మరో 326 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో దేశంలో ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 46,555 మంది మృతి చెందారు.

Britain Imposes lockdown for 2nd Wave of Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News