Tuesday, April 30, 2024

మార్కెట్‌లోకి అధునాతన ఎలక్ట్రిక్ కార్గో ఆటో

- Advertisement -
- Advertisement -

Advanced Electric Cargo Auto into the Market

హైదరాబాద్ : పెట్రోల్ హెచ్చు, తగ్గుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోందని కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒహెచ్‌ఎం, ఒఎస్‌ఎం సంస్థలు కొత్తగా రూపొందించిన ఎలక్ట్రిక్ కార్గో ఆటోను ఆయన మార్కెట్‌లోకి విడుదల చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అస్కిలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మనాభయ్యతో పాటు ఒఎస్‌ఎం చైర్మన్ ఉదయ్ నారంగ్, ఒఎస్‌ఎం ఎండి ముఖర్జీ, ఒహెచ్‌ఎం సిఇఒ నిర్మలరెడ్డి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని ప్రకటించిన మరునాడే ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్‌లోకి రావడం చాలా ఆనందంగా ఉందని పద్మనాభయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభిరుచికి అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ ఆటోను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో షోరూమ్‌ను ఏర్పాటు చేశామని, నవంబర్ 15 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని ఒహెచ్‌ఎం సిఇఒ నిర్మల్‌రెడ్డి తెలిపారు. ఈ వాహనాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ ప్రయాణం చేయవచ్చన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభిస్తామని వివరించారు.

Advanced Electric Cargo Auto into the Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News