Saturday, April 27, 2024

నగదు పంపిణీ మళ్లీ షూరూ…

- Advertisement -
- Advertisement -
Flood Relief Money Distribution to Resume in Hyderabad
వరద బాధిత ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు

హైదరాబాద్: వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్ధిక సహాయం కింద నగదు పంపిణీ మళ్లీ ప్రారంభకానుంది. ఇందుకు సంబంధించి అధికారులు షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నారు. గత నెల 12, 17 తేదీల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపుతో లక్షలాది కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురైయ్యాయి. దీంతో చల్లించిపోయిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రతి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్ధిక సహాయం కింద రూ.10వేలను అందజేయాలని అదేశాలు జారీ చేయడమే కాకుండా ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ విభాగానికి రూ.550 కోట్లను మంజూరు చేశారు.

దీంతో ఇప్పటీ వరకు జిల్లా యంత్రాగం గ్రేటర్ వ్యాప్తంగా 3.87 బాధిత కుటుంబాలకు రూ.10వేల చోప్పున రూ.387.90 కోట్ల నగదును పంపిణీ చేశారు. అయితే కొంతమంది బాధితులు తమకు ఆర్ధిక సహాయం అందలేదంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రతి బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావు అదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దిశా నిర్ధేశంతో జిహెచ్‌ఎంసి అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. వరద ప్రభావిత కుటుంబాలకు అధికారులు ఇంటింటికి వెళ్లి నగదును పంపిణీ చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News