Friday, May 3, 2024

బ్రిటన్ ప్రిన్స్‌కు లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు!

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్.. ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఒక మిలియన్ పౌండ్లు విరాళం తీసుకున్నారని ‘ది సండే టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ఈ మొత్త చార్లెస్‌కు చెందిన చారిటబుల్ ట్రస్టులో జమ అయినట్లు తెలిపింది. అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి(9/11) ఘటనలో బిన్ లాడెన్ ప్రధాన సూత్రధారి. అలాంటిది ఆయన సోదరులు బకర్ బిన్ లాడెన్, షఫీక్‌లనుంచి ప్రిన్స్ చార్లెస్ భారీ విరాళం తీసుకోవడం చర్చనీయాంశమయింది. అయితే సౌదీకి చెందిన వీళ్లు ఏదయినా తప్పు చేశారా?అనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇప్పటికే నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్లెస్ చారిటబుల్ ట్రస్టులపై నిఘా మరింత పెరిగింది.

2013లో బకర్ లాడెన్‌ను ప్రిన్స్ చార్లెస్ లండన్‌లో కలిసినప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ట్రస్టుకు ఈ విరాళం అందినట్లు ఆ పత్రిక కథనం తెలిపింది. ట్రస్టు సలహాదారులనుంచి అభ్యంతరాలు వ్యక్తమయినా ప్రిన్స్ చార్లెస్ దీన్ని అంగీకరించారని తెలిపింది. అయితే ఆ సమయంలో ట్రస్టులోని ఐదుగురు సభ్యులు విరాళం తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫండ్(పిడబ్లు సిఎఫ్) చైర్మన్ ఇయాన్ చెషైర్ వెల్లడించారు. సౌదీ వ్యాపారవేత్తతో ‘క్యాష్ ఫర్ ఆనర్స్’ కుంభకోణం ఆరోపణలపై ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన మరో చారిటబుల్ ట్రస్టుపై బ్రిటీష్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దర్యాప్తు ఆరంభించారు.ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ అనంతరం ప్రిన్స్ ఫౌండేషన్ ముఖ్య అధికారి గతేడాదే రాజీనామా చేశారు.

Britain Prince Received Donations from Laden’s Family

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News