Tuesday, May 21, 2024

సదర్ ఉత్సవాల్లో అపశృతి

- Advertisement -
- Advertisement -

Buffalo Hulchal at Sadar festival

హైదరాబాద్ : సదర్ ఉత్సవాల్లో దున్నపోతు హల్‌చల్ చేసింది. రోడ్డు మీదికి వచ్చి కన్పించిన వారిని కన్పించినట్లు కుమ్మేసింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలో చోటుచేసుకుంది. నగరంలోని ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలో సదర్ ఉత్సవాలు నిర్వహించేందుకు దున్నపోతును తీసుకుని వచ్చారు. ఈ క్రమంలోనే రోడ్డు మీదికి వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వచ్చిన ప్రజల మీదికి పరిగెత్తడంతో భయభ్రాంతులకు గురైన పలువురు పరుగును లంకించుకున్నారు. దున్నపోతును కట్టడి చేసేందుకు యత్నించిన వీలు కాలేదు. ఈ క్రమంలోనే స్కూటీపై వస్తున్న మహిళను బైక్‌తోపాటు ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకుని కంట్రోల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News