Wednesday, May 1, 2024

ప్రజల సొమ్ముతో బిఆర్‌ఎస్ పార్టీ ప్రచారం: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రజా సొమ్ము వెచ్చిస్తూ, పార్టీ ప్రచారం చేస్తోందని,అందుకు నిరసనగా దశాబ్ది దగా పేరుతో, నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి,నిరసన చేపట్టి,ఆర్డీఓ శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు. గురువారం నర్సాపూర్ అందెద్కర్ చౌరస్తాలో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజి రెడ్డి, రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ దిష్టి బొమ్మకు పది తలలు ఏర్పాటు చేసి, ప్రతి తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన నిర్వహించి దగ్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు, స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి, అమరవీరుల కుటుంబాలను ఆదుకోక పోవడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని తమ స్వంత జాగీరుగా చేసుకొని దోచుకున్నరని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య ,ఫీజ్ రీయంబర్స్ మెంట్,ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి,పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణ మాఫీ, 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, 12 శాతం గిరిజన రిజర్వేషన్లు ప్రకటించి విఫలమైందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో,ప్రజా ధనముతో పార్టీ ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, అమరుల కుటుంబాలకు సాయమేది అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే, తొలి మలి దశ ఉద్యమం లో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబంలో ఒకరికి, ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లి/తండ్రి/భార్యకు రూ.25,000/-నెలవారీ గౌరవ పెన్షన్ ఇస్తుందన్నారు.

గత 9 యేండ్లుగ గుర్తుకు రని తెలంగాణ అమరుల కుటుంబాలకు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గవర్నర్ కోటాలో, ఎమ్మెల్సీ పదవి ఇస్తమనడం తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని,తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్‌పిటిసి శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వన్, కౌడిపల్లి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రుస్తుంపెట్ ఎంపిటిసి అశోక్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ ,కౌడిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస రావు, శివంపేట్ మండల్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, కొల్చారం మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్,

వెల్దుర్తి మండలం అధ్యక్షులు నర్సింహ రెడ్డి, హత్నుర మండల అధ్యక్షులు కిష్టయ్య, చిల్పిచెట్ మండల అధ్యక్షులు, నర్సాపూర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సందీప్, యువజన కాంగ్రెస్ నాయకులు మణిదీప్, సీనియర్ నాయకులు ఉదయ్ కుమార్, నర్సింగరావు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News