Monday, April 29, 2024

ఘనంగా గోల్కొండ బోనాలు..

- Advertisement -
- Advertisement -

గోల్కొండ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి గురువారం భక్తులు భక్తి శ్రద్దలతో తొలి బోనం సమర్పించారు. దీంతో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. మంత్రులు, మహమూద్ అలీ, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డిలు ప్రభుత్వం తరుపున జగదాంబిక అమ్మవారికి బంగారు బోన్నం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు . ఈ సందర్భంగా గోల్కొండ కోట అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. బోనాల ఉత్సవాల్లో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా లంగర్ హౌజ్ వద్ద అమ్మవారి తొట్టెల ఊరేగింను మంత్రులు ప్రారంభించారు. ఈ తొట్టెల ఊరేగింపు డప్పు చప్పులు, పోతరాజుల నృత్యాల మధ్య చోటా బజార్, బడా బజార్, ఫతే దర్వాజా, గోల్కొండ చౌరస్తాల నుంచి గొల్కోండ కోటకు చేరుకుంది. లంగర్‌హౌజ్ నుంచి గోల్కొండ కోట వరకు సాగిన తొట్టెల ఊరేగింపుసందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవాల సందర్బంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని చోట్ల మంచినీటి సౌకర్యంతో పాటు మొబైల్ టాయిలెంట్లు, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. బోనాల ఉత్సవాల్లో నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News