Sunday, May 5, 2024

సొంతూరు బాట పట్టిన జనం… హైదరాబాద్ ఖాళీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ ఖాళీ అయింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఉప్పల్, జూబ్లీ బస్ స్టేషన్, ఆరంఘర్, ఎల్బీనగర్ చౌరస్తా వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు ప్రజలు స్వస్థలాలకు పయమయ్యారు. ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో అదనంగా బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రేపు జరగాల్సిన పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News