Friday, May 10, 2024

పిలిచి పీటేస్తే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చున్న మిత్రుడు తుమ్మల నాగేశ్వర రావును పిలిచి మంత్రి పదవి ఇచ్చి, చేస్తే ఆయన వల్ల జిల్లాలో బిఆర్‌ఎస్‌కి గుండుసున్న మిగిల్చాడని, జిల్లాలో బిఆర్‌ఎస్‌కు ఒక సీటు కూడా రాకుం డా చేశాడని రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా పాలేరు సెగ్మెంట్ పరిధిలో కూసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఇటివల బిఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రె స్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మలపై ఘాటు విమర్శలు చేశారు. తానేదో అన్యాయం చేశానని తనను పదేపదే విమర్శిస్తున్నాడని, అనాడు అజయ్‌పై పోటీ చేసి ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చుంటే మిత్రుడు కదా అని పిలిచి మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఎంఎల్‌సి పదవి ఇచ్చి అదుకున్నానని తెలిపారు. తరువాత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణిస్తే తొలుత ఆయన సతీమణికి మద్దతు ఇవ్వాలనుకున్నామని, ఆ సమయంలో తుమ్మల వచ్చి రిజర్వేషన్ మార్పువల్ల సెగ్మెంట్ లే కుండా పోయిందని, టిక్కెట్ ఇస్తే ఇక్క డి ప్రజలకు సేవ చేసుకుంటానని అడిగితే ఆ నాడు ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చి మేమంతా ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేసి 40వేలకు పై చీలుకు ఓట్లతో గెలిపించామని తెలియ జేశారు.

ఐదేళ్ల పాటు జిల్లామీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే ఆయన జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద గుండు సున్నాను మిగిల్చారన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తుమ్మలకు అన్యాయం చేసిందా.. తుమ్మల బిఆర్‌ఎస్‌కు అన్యాయం చేశారా? న్యాయం మీరే చేప్పాలని ముఖ్యమంత్రి సభికులను కోరారు. నిన్న మొన్నటి వరకు కెసిఆర్ వల్లనే పాలేరు కు మోక్షం వచ్చిందన్న నాలుకలు ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని నరం లేని నాలుకలు ఉన్న నాయకులు ఉల్టా మాట్లాడున్నారని కానీ సత్యం మారదు.. నిప్పులా ఉంటుందన్నారు. రాజకీయ శక్తులకు అవకాశం ఇవ్వకుండా తగిన బుద్ది చేప్పాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపు నిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News