Tuesday, May 21, 2024

రేపటి సమావేశంలో షూటింగ్‌ల బంద్‌పై తుది నిర్ణయం: సి.కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

కొత్త సినిమాల నిర్మాణం ఆపే ఉద్దేశం తమకు లేదని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలియజేసింది. టాలీవుడ్‌లోని వివిధ సమస్యలపై శనివారం జరిగే సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్‌తో కలిసి తుది నిర్ణయం తీసుకుంటామని నిర్మాతల మండలి చెప్పింది. నిర్మాణ వ్యయం, సినిమా టిక్కెట్ ధరలు, ఓటీటీల ప్రభావం తదితరాలను దృష్టిలో పెట్టుకొని కొందరు నిర్మాతలు ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలని భావించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సమావేశం జరిగింది. అనంతరం నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ “సమావేశంలో నిర్మాతలు అందరం టాలీవుడ్‌లోని సమస్యలపై చర్చించాము. సినిమాల కంటెంట్, ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టిక్కెట్ రేట్లు, ఓటీటీలపై చర్చించాము. షూటింగ్‌లు బంద్ చేద్దామా? లేదా కొత్తవి మొదలు పెట్టకుండా జరుగుతున్న సినిమాల వరకు మాత్రమే షూటింగ్‌లు జరపాలా?… అని చర్చించాము. యూనియన్‌లు, ఫెడరేషన్, మేనేజర్‌ల పాత్ర, నటులు, సాంకేతిక నిపుణుల సమస్యల గురించి కూడా మాట్లాడాము. శనివారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటాము”అని అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, అభిషేక్ నామా, వైవిఎస్ చౌదరి, సునీల్ నారంగ్, ఠాగూర్ మధు, సుధాకర్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్, తమ్మారెడ్డి భరద్వాజ, అశోక్ కుమార్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

C Kalyan comments on Telugu Films shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News