Tuesday, May 21, 2024

దేశవ్యాప్తంగా రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

Cancellation of trains across in India

వారణాసిలో చిక్కుకుపోయిన 800 మంది తెలుగు యాత్రికులు

హైదరాబాద్ : త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్నినిరసిస్తూ దేశవ్యాప్తంగా యువత, నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లను, రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. తాజాగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. 13 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఉద్రిక్త పరిస్దితుల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని చోట్ల దారి మళ్లించింది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 800 మంది తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఒంగోలు జిల్లాల వాసులు వున్నారు. వారణాసి నుంచి బయల్దేరాల్సిన ధనాపూర్- సికింద్రాబాద్ రైలు రద్దు కావడంతో వీరంతా ఇక్కట్లు పడుతున్నారు. సొంత స్థలాలకు ఎలా వెళ్లాలో తెలియక యాత్రికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News