Thursday, August 7, 2025

మెడిసిటీ మెడికల్ కాలేజీలో డ్రగ్స్ కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మెడిసిటీ మెడికల్ కాలేజీలో మరోసారి డ్రగ్స్ సరఫరా కలకలం సృష్టించింది. మెడికోలకు గంజాయి (Cannabis) సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అరఫాత్, జరీనాలు వంద మందికి డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. సరఫరాదారుల నుంచి 82 మంది డ్రగ్స్ కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 24 మంది మెడికోలకు గంజాయి పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరు మహిళా మెడికోలు సహా 9 మంది మెడికోలకు గంజాయి పాజిటివ్‌గా తేలింది. వంద మందిలో 32 మంది మెడికోలు మెడిసిటీ కాలేజీ చెందినవారిగా గుర్తించారు. మెడికోల తల్లిదండ్రుల సమక్షంలో ఈగల్ టీమ్ కౌన్సిలింగ్ నిర్వహించింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News