Saturday, May 4, 2024

సాయిచంద్ లేని పాట ఊహించలేం : మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రజా గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ లేని పాటను ఊహించలేకపోతున్నమంటూ సంతాపం తెలిపారు. గాయకుడితోపాటు ఒక నాయకుడిని కూడా కోల్పోయామని, సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.

ఆట పాటలతో ఉద్యమానికి ఊపిరిపోసిన సాయిచంద్
-డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు, మలి దశ ఉద్యమ సమయంలో తన పాటతో విద్యార్థులకు, ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతినికి గురి చేసిందని జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు.

ఆయన మరణవార్త తెలుసుకుని హుటాహుటిన గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేరుకొని ఆయన పార్థివదేహంపై డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బిఆర్‌ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డిలు పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమ సమయం లో తన ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరి పోసిన సాయిచంద్ మృతి కల్చి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నిత్య చైతన్య స్పూర్తి ప్రదాత సాయిచంద్ మరణం తీరని లోటు : పిట్టల రవీందర్
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సహచరుడు, నిత్య చైతన్య స్ఫూర్తి ప్రదాత, ఆత్మీయ మిత్రుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు సా యిచంద్ అకాల మరణం తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. తెలంగాణ సమాజానికే ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అని పేర్కొన్నారు. సాయిచంద్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన పిట్టల రవీందర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.-

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News