Saturday, September 30, 2023

కుంటలోకి దూసుకెళ్లిన కారు….

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కారు కుంటలోకి దూసుకెళ్లిన సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటనారాయణ (56) అనే వ్యక్తి పెద్దపల్లి సబ్ స్టేషన్‌లో ఎఇగా పని చేస్తున్నాడు. ఎఇ తన కారులో వరంగల్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో కొత్తగట్టు గ్రామ శివారులో ఉన్న కుంటలోకి దూసుకెళ్లింది. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూకోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థుల సహాయంతో కారులో ఉన్న ఎఇని బయటకు తీశారు. వెంకటనారాయణ గ్రామస్థులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులను, వాహనదారులను పోలీసులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News