Wednesday, September 18, 2024

చార్జిషీట్‌లో తొలిసారి సిసోడియా పేరును చేర్చిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్ ధల్, హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే అనే వ్యక్తి పేర్లతో పాటు ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేరును కూడా సిబిఐ మంగళవారం చేర్చి అభియోగపత్రం(చార్జిషీట్)ను దాఖలు చేసింది.

సిబిఐ మంగళవారం తన రెండో అనుబంధ చార్జిషీట్‌లో ఆ నలుగురి పేర్లను పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను చార్జిషీట్‌లో చేర్చారు. కాగా దాదాపు రెండు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా పేరును సిబిఐ తన చార్జీషీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి. ఇదే కేసులో గతంలో ఏడుగురిపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News