Sunday, April 28, 2024

ఘనంగా వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 37వ డివిజన్ గిరిప్రసాద్ నగర్‌లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన బస్తా దవాఖానను వరంగల్ తూర్పులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంటటరమణ, స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్‌కు స్థానికులు బతుకమ్మలు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఇదే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ జెండా గద్దెను జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. ల్యాబ్‌ను అదనపు కలెక్టర్, మెడికల్ ఆఫీసర్ రూమ్‌ను జిల్లా వైద్యాధికారి, మెడికల్ షాపును స్థానిక కార్పొరేటర్, స్టోర్ రూమ్‌ను కాలనీ అధ్యక్షుడు ఎండీ అల్తాఫ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2014కు నేటికి వైద్య రంగంలో సిఎం కెసిఆర్ గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. గతంలో 4 మెడికల్ కళాశాలలు ఉండగా నేడు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల నిర్మించుకుంటున్నామన్నారు. అలాగే ఆసుపత్రులు, బస్తీ దవాఖాన, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్ అదనపు బ్లాక్‌లు, కంటి వెలుగు, కెసిఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్స్ వంటి అనేక పథకాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నూతన ఆసుపత్రి డాక్టర్ విలాసాగరం అనూష, అర్చన, పీఏసీఎస్ ఛైర్మన్ కేడల జనార్దన్, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి, డివిజన్ అధ్యక్షుడు విజయ్, డివిజన్ ఇన్‌ఛార్జి బిల్లా రవి, కార్యకర్తలు, అధికారులు, గిరిప్రసాద్ నగర్, ఎంఎం నగర్, బుడిగ జంగాల కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News