Sunday, April 28, 2024

రాములోరి ఉత్సవానికి తారాతోరణం

- Advertisement -
- Advertisement -

సినీతారల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు,
ప్రముఖులతో అయోధ్యానగరం కళకళ

అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ముహూర్తం ఆసన్నమవుతున్న తరుణంలో ఆలయం వద్ద పూజా క్రతువులు ఒకపక్క జరుగుతుందగా మరోపక్క ఏర్పాట్లు శరవేగంతో సాగుతున్నాయి. వచ్చే సోమవారం జరగనున్న ఆలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం 8 వేల మందికి పైగా ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ ఆహ్వానితుల జాబితాలో ప్రముఖ సినీతారల మొదలుకుని బడా పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల వరకు ఎందరో ప్రముఖులు ఉన్నారు.

భారతీయ అపర కుబేరులు ముకేష్ అంబానీ కుటుంబంతోపాటు గౌతమ్ అదానీ, రతన్ టాటా, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి తదితర ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఒక ప్రవేత్యక విమానంలో అమితాబ్ బచ్చన్ అయోధ్య నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ నుంచి అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, చిరంజీవి, మోహన్‌లాల్, అనుపమ్ ఖేర్, రజనీకాంత్, ప్రభాస్, మాధురీ దీక్షిత్, సంజయ్ లీలా భన్సాలీ, ధనుష్, రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ, కంగనా రనౌత్, రిషబ్ షెట్టి, యష్, ఆలియా భట్, సన్నీ దియోల్ తదితరులు ఉన్నారు. క్రీడాకరులకు సంబంధించి సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, దీపికా కుమారి తదితరులకు ఆహ్వానాలు వెళ్లాయి.

ఆహ్వానాలు అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ముకేష్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా, కుమారులు ఆకాష్, అనంత్, కోడలు శుక్లా, కాబోయే కోడలు రాధికా మర్చెంట్ ఉన్నారు. ఆదిత్య బిర్లా గూపు చైర్‌పర్సన్ కుమార మంగళం బిర్లా, ఆయన భార్య నీరజ, పిరమల్ గ్రూపు చైర్‌పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ అనంద్ మహీంద్ర, డిసిఎం శ్రీరామ్‌కు చెందిన అజయ్ శ్రీరామ్, టిసిఎస్ సిఇఓ కె కృతివాసన్‌తోపాటు డాక్టర్ రెడ్డీస్ ఫార్మాసూటికల్‌కు చెందిన కె సతీష్ రెడ్డి, జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సిఇఓ పునీత్ గోయంక, ఎల్ అండ్ టి సిఇఓ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్, దివీస్ లేబొరేటరీస్‌కు చెందిన దురలీ దివి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ అధిపతి నవీన్ జిందాల్, మేదాంత గ్రూపునకు చెందిన నరేష్ త్రెమాన్ తదితరులు ఉన్నారు.

మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, ప్రనాళికా సంఘం మాజీ డిప్యుటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. భారతదేశ జి20 షెర్పా అమితాబ్ కాంత్, మాజీ దౌత్యవేత్త అమర్ సిన్హా, మాజీ అటార్నీ జనరల్స్ కెకె వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ, భారతీయ మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తదితరులకు జాబితాలో చోటు దక్కింది. వీరిలో కొందరు జనవరి 22న ప్రైవేట్ విమానాలలో నేరుగా అయోధ్యకు రానుండగా మరి కొందరు రోడ్డు మార్గంలో ఒకరోజు ముందుగానే అయోధ్యకు లేదా సమీపంలోని లక్నో నగరానికి చేరుకుని రాత్రికి అక్కడే బసచేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News