Sunday, April 28, 2024

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి

- Advertisement -
- Advertisement -
  • మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్‌రెడ్డి

శంకర్‌పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొండకల్ గ్రామంలో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా, ఎంపీ రంజిత్‌రెడ్డి బుధవారం మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అధికారులు ప్రజాప్రతినిధులతో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపి ఎన్నికల సమయంలో గుజరాత్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించిందని అన్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి తాయిలాలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం లబ్ధి పొందుతుందని ఆయఆరోపించారు. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో తెలంగాణ కేంద్రంగా ప్రపంచ దేశాలకు రైల్వే బోగీలను ఎగుమతి చేయబోతున్నామన్నారు. రాష్ట్రానికి న్యాయ పర ంగా ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు తాము పార్లమెంట్‌లో ప్రశ్నించిన స్పందన లేదన్నారు. కేంద్ర సహకరించకు న్నా, మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వారికి రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయించి, నేడు ప్రపంచానికే ఎగుమతి చేసే స్థాయి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తెల ంగాణ కేంద్రమైందన్నారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. న్యాయంగా మన రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించారని బిజెపి పార్టీపై ఎంపి మండిపడ్డారు. కనీసం ఎన్నికల ము ందైనా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరంగా నిర్మించిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గోవర్ధన్ రెడ్డి, శేరిగూడ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్ప ంచ్ ఇంద్రసేనారెడ్డి, నాయకులు వాసుదేవ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News