Tuesday, April 30, 2024

కారు సర్వీసింగ్‌కు పోయింది.. వంద స్పీడుతో దూసుకొస్తది

- Advertisement -
- Advertisement -

కారు సర్వీసింగ్ కు పోయింది.. మళ్లీ వంద స్వీడుతో దూసుకువస్తదని మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. గత పదేళ్లల్లో మన మధ్య సమన్వయం లోపించింది వాస్తవమని కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలన లో 6.5 లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆయన పేర్కొన్నారు.

కనీసం మంత్రిగా పని చేయని వారిని సిఎం చేస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు పడలేదు.. కెసిఆర్ ప్రభుత్వంలో వారం రోజుల్లోనే రైతుబంధు పడేదని గుర్తుచేశారు. రైతుబంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి అన్నారు… చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ కు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంటోందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్తీక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News