Thursday, May 2, 2024

బాస్మతి బియ్యం ఎగుమతిపై కేంద్రం కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాస్మతి ముసుగులో నిషేధిత సాధారణ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు గమనించిన కేంద్ర ప్రభుత్వం వీటి కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిషేధిత కోటా కింద ఉన్న బాస్మతీయేతన తెల్లబియ్యం ఎగుమతులను నిరోధించడానికి బాస్మతి బియ్యం ఎగుమతులపై అదనపు భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. బాస్మతీయేతర తెల్లబియ్యాన్ని తప్పుగా వర్గ్గీకరించి అక్రమ ఎగుమతి చేస్తున్నట్లు విశ్వసనీయ క్షేత్రస్థాయి నివేదికలు అందినట్లు ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. బాస్మతీయేతర తెల్లబియ్యాన్ని హెచ్‌ఎస్ కోడ్స్ ఆఫ్ పార్‌బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. దేశీయంగా ధరలను కట్టడి చేయడానికి, ఆహార భద్రత కోసం గత జులై 20నుంచి బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.

కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ఈ ఏడాది బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. బాస్మతి బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమ ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే అగ్రికల్చరల్ అండ్‌ప్రాసెస్డ్ ఫుడ్‌ప్రాడక్ట్‌క్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆపెడా)కి కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్ట్‌లకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లొకేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సిఎసి)జారీకి నమోదు చేయాలని ఆపెడాకు ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్లకన్నా తక్కువ విలువగలిగిన కాంట్రాక్ట్‌లను నిలిపివేయవచ్చని, అలాగే వాటి పరిశీలనకు ఆపెడా చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయవచ్చని సూచించింది.

ని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News