Friday, May 3, 2024

పాముకాటు మరణాల తగ్గింపు లక్ష్యంగా జాతీయ ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో పాముకాటుతో సంభవించే మరణాలను, అంగవైకల్యం పొందే వారి సంఖ్యను 2030 నాటికి సగానికి సగం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ దేశ వ్యాప్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం దీనిని విడుదల చేసి ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్రాలకు ఒక మార్గదర్శక పత్రంలా ఈ ప్రణాళిక పనిచేస్తుంది.

ఎక్కడైతే పాముకాట్లు ఎక్కువగా ఉంటున్నాయో అక్కడ ఆస్పత్రుల్లో విషం విరుగుడు మందులను నిత్యం అందుబాటులో ఉంచితే ముప్పును తగ్గించుకోవచ్చని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. పాముకాటు ప్రమాదం జరిగిన వెంటనే ఏమేం చేయాలో ప్రజలకు సరిగ్గా అవగాహన కల్పించడం చాలా అవసరమని భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి పాముకాటు ప్రమాదాలను నివారించాలని నిర్ణయించింది. పాముకాటు బాధితులకు సత్వరం వైద్యం అందేలా ప్రత్యేక అంబులెన్సులు సమకూరుస్తారు.

బాధితులకు అవసరమైన అన్ని పరీక్షలు ఒకే చోట పూర్తి చేసేలా ప్రత్యేక లేబొరేటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఐసీయూ పడకలు, డయాలసిస్ యూనిట్ అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వం ఇవన్నీ ప్రతిపాదించింది. పాముకాటుకు సంబంధించి సందేహాలను తీర్చడానికి 24 గంటలూ పనిచేసేలా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. విషం విరుగుడు మందులను అత్యవసర జాబితాలో చేర్చాలని రాష్ట్రాలను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News