Wednesday, May 1, 2024

జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా చేసిన మార్పులు, చేర్పులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం హోంశాఖ అంగీకరించింది. ఇందులో నారాయణపేట జిల్లాకు జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లాకు కాళేశ్వరం జోన్‌లో, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్పు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు స్థానికతను ఖరారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఆమోదానికి అనుగుణంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తారు.
మార్పులు, చేర్పులు చేసిన నేపథ్యంలో కాళేశ్వరం జోన్..1లో భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు జిల్లాలు వస్తాయి. అలాగే బాసర జోన్…2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు, రాజన్న జోన్..3లో కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, భద్రాద్రి జోన్..4లో వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు, యాదాద్రి జోన్..5లో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు, చార్మినార్ జోన్..6లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు, జోగులాంబ జోన్..7లో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలు వస్తాయి. అలాగే మల్టీ జోన్…1లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు, మల్టీ జోన్..2లోయాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు వస్తాయని ఆ ఉత్తర్వులో సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.

Centre Govt approved for Changes in TS zonal system

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News