Tuesday, May 21, 2024

నెగ్గిన చంపయ్ సోరెన్

- Advertisement -
- Advertisement -

రాంచీ : ఝార్ఖండ్‌లో ముఖ్యమంత్రి చంపయి సోరెన్ సారథ్యంలోని జెఎంఎం కూటమి సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది. 81 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47 మంది వోటు చేశారు. తీర్మానాన్ని 29 మంది వ్యతిరేకించారు. స్వతంత్ర సభ్యుడు సరయు రాయ్ వోటింగ్‌కు గైర్ హాజరు అయ్యారు. వోటింగ్ సమయంలో అసెంబ్లీలో 77 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. అధికార కూటమిలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జెడి భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఏకైక సిపిఐ (ఎం) శాసనసభ్యుడు కూటమికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్నారు.

బిజెపి నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో బిజెపి సభ్యులు 26 మంది, ఎఐఎస్‌యు పార్టీ సభ్యులు ముగ్గురు ఉన్నారు. జెఎంఎం శాసనసభా పక్షం నాయకుడు చంపయి సోరెన్ ఈ నెల 2న ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) డిసెంబర్ చివరి వారంలో అరెస్టు చేసిన తరువాత చంపయి బాధ్యతలు స్వీకరించారు. సభలో తమ ప్రభుత్వ మెజారిటీని రుజువు చేయడానికి చంపయి సోరెన్ పది రోజుల గడువు ఇచ్చారు. సోమవారం (5న) విశ్వాస పరీక్ష నిర్వహణకు ఆయన నిశ్చయించారు. ప్రస్తుతం ఇడి కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు అనుమతితో విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. విశ్వాస పరీక్షకు ముందు అధికార కూటమి సభ్యులకు బిజెపి ఎర వేయవచ్చుననే భయంతో కూటమి సభ్యులు 36 మంది రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు వెళ్లారు. వారు ఆదివారం సాయంత్రం రాంచీకి తిరిగి వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News