Sunday, April 28, 2024

అందరికీ సీట్లు ఇవ్వలేకపోయాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్క్ షాప్ నిర్వహించారు. కూటమి అభ్యర్థి గెలవాలనేది మూడు పార్టీల లక్ష్యం కావాలని చంద్రబాబు తెలిపారు. పొత్తులతో అందరికీ సీట్లు ఇవ్వలేకపోయామని ఆయన వెల్లడించారు. రౌడీయిజం, అధికార దుర్వినియోగాన్ని గట్టిగా ఎదుర్కోవాలని బాబు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలు గెలవాలంటే రాష్ట్రంలో ఏన్డీయే కూటమి గెలవాలన్నారు. విశాఖ డ్రగ్స్ ఘటనలో రాష్ట్ర అధికారుల తీరును సిబిఐ తప్పుబట్టిందన్నారు.

డ్రగ్స్ పై పోరాడుతుంటే తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారని, గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సిఎం ఎప్పుడూ సమీక్ష చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. టిడిపి నేతలు, పురందేశ్వరిపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని తెలిపారు. అక్రమాలకు తెరలేపి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. వైసిపి లాంటి పార్టీల కట్టడికి డిజిటల్ కరెన్సీ రావాలన్నారు. రూ. 200, రూ.500 నోట్లను రద్దు చేసే పరిస్థితి రావాలని చెప్పారు.  పెద్దనోట్లు రద్దు కావాలనేది తన ఆలోచన అన్నారు.

బిజెపి అధ్యక్షురాలు రాజీనామా చేశారని ఫేక్ లెటర్ పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక పొత్తు అని తన పేరుతో ఫేక్ లెటర్లు వదిలారని చంద్రబాబు మండిపడ్డారు. పురందేశ్వరి తన కుటుంబ సభ్యురాలే కావచ్చు.. ఆమె 30 ఏళ్లకు పైగా వేరే పార్టీలో ఉన్నారని సూచించారు. జనసేన, పవన్ పై ఇలాగే తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఏన్డీయేకు కేంద్రంలో 400కు పైగా వస్తాయని జోస్యం చేప్పారు. రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావాలన్నారు. కడప ఎంపి స్థానంలో మనమే గెలవబోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News