Friday, May 10, 2024

మెట్రో రైలు వేళల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

Changes in Hyderabad Metro Train times

 

హైదరాబాద్ : ప్రయానికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. మెట్రో రైళ్లు నడుస్తున్న సమయం కన్నా మరో అరగంట ఎక్కువ సేపు రైళ్లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రాత్రి 9 గంటల వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు నడపాలన్న డిమాండ్లు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. కరోనా సంక్షోభం కన్నా ముందు మెట్రో రైళ్లు రాత్రి 10 గంటల వరకు నడిచేవి. గతంలో నడిపినట్టుగా మెట్రో రైళ్లను 10 గంటల వరకు నడపాలని ప్రయాణికులు మెట్రో అధికారులను కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అధికారులు మరో అరగంట సమయాన్ని పొడిగించారు. అక్టోబర్ 28 నుంచి రాత్రి 9.30 గంటల వరకు రైళ్లు నడపాలని నిర్ణయించారు. ప్రతీ మూడు నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News