Friday, May 3, 2024

ఆ 18 మంది ఉగ్రవాదులే

- Advertisement -
- Advertisement -

Union Home Ministry declared another 18 people Terrorists

 

న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోం శాఖ మంగళవారం మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకులు భత్కల్ సోదరులు, 26/11 దాడులకు ముఖ్య కారకుడు సాజిద్ మిర్, యూసఫ్ మిజమ్మిల్, లష్కరే కమాండర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహిత అనుచరుడు చోటా షకీల్, 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమా నం హైజాకర్లు అబ్దుల్ రౌఫ్ అస్గర్, ఇబ్రహీం అథర్, యూసఫ్ అజర్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నా రు. దావూద్ ఒబ్రహీం అనుచరులు మహమ్మద్ అనిస్ షేక్, ఇబ్రహీం మెమన్ అలియాస్ టైగర్ మెమన్, జావేద్ చిక్నాల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

అలాగే పాకిస్తాన్‌కు చెం దిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ఫలాఇ ఇన్సానియత్ ఫౌండేషన్ ( ఎఫ్‌ఐఎఫ్) డిప్యూటీ చీఫ్ షాహిద్ మెహమూద్, అలియాస్ సాహిద్ మెహమూద్ రెహమతుల్లా, అక్షర్ ధామ్, హైదరాబాద్ టాస్‌ఫోర్స్ కార్యాలయంపై దాడులతో సంబంధం ఉన్న ఫర్హతుల్లా ఘోరి అలియాస్ అబు సుఫియాన్‌ల పేర్లు కూడా సవరించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రూపొందించిన ఈ జాబితాలో ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇంతకు ముందు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్ట కింద కేవలం సంస్థలను మాత్రమే నిషేధించే వారు. అయితే 2019 ఆగస్టులో పార్ల్లమెంటులో అమోదించిన సవరించిన ఉగ్వాద నిరోధక చట్ట కింద వ్యక్తులను కూడా ఉగ్వాదులుగా ప్రకటించే వీలుం ది. ‘జాతీయ భద్రతను బలోపేతం చేయడం, ఉగ్రవాదంపై ఉకుక్కపాదం మోపే క్రమంలో మోడీ ప్రభుత్వం ఈ 18 మందిని సవరించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఉగ్రవాదులుగా ప్రకటించింది’ అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఈ చట్టం కింద ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో నలుగురిని, 2020 జులైలో తొమ్మిది మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. వారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, లష్యకరే తోయిబా వ్యవస్థాపకుడు హహీజ్ ముహమ్మద్ సయీద్, ముంబయి ఉగ్వాద దాడుల నిందితుడు జకీవుర్ రెహమాన్ లఖ్వీ, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వార్, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ చీఫ్ వాధవా సింగ్ బబ్బర్ ఉన్నారు. తాజాగా ప్రకటించిన వారితో కలుపుకొని ఇప్పటివరకు 31 మందిని ఉగ్రవాదుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News