Sunday, May 12, 2024

రాముడు, హనుమంతుడి ఇమేజిని దిగజార్చారు

- Advertisement -
- Advertisement -

రాయపూర్: కోట్లాది భారతీయులు ఆరాధించే శ్రీరాముడు, హనుమంతుడి ఇమేజిని దెబ్బతీయడానికి‘ఆదిపురుష్’ సినిమాలో ప్రయత్నం జరిగిందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ శనివారం ఆరోపించారు. ప్రజలు గనుక డిమాండ్ చేస్తే రాష్ట్రంలో ఈ సినిమాను నిషేధించే విషయాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన అన్నారు. సినిమాలో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్నాయని ఆయన అంటూ, హిందూ మతానికి తామే రక్షకులమని చెప్పుకునే పార్టీలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి బాఘెల్ అన్నారు.

రాష్ట్రప్రభుత్వం ఈ సినిమాను నిషేధిస్తుందా అని విలేఖరులు అడగ్గా, ప్రజలు ఈ దిశగా డిమాండ్ చేస్తే ప్రభుత్వం నిషేధించే విషయం గురించి ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ‘మన దేవుళ్ల ఇమేజిని కళంకితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మర్యాద పురుషుడయిన శ్రీరాముడి ప్రశాంత రూపం, భక్తి భావంతో తడిసి మద్దయిన హనుమంతుడినే మనం చూశాం. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఇమేజిని మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది’ అని బాఘెల్ అన్నారు. ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం కూడా ఆదిపురుష్‌లోని కొన్ని సంభాషణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ టీమ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News