Sunday, April 28, 2024

స్మార్ట్‌ఫోన్ కోసం రిజర్వాయర్‌లో నీటిని తోడేసిన అధికారి..

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: రిజర్వాయర్‌లో పడిన ఖరీదైన తన స్మార్ట్‌ఫోన్ కోసం చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని తోడించేసిన విషయం తెలిసిందే. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన సదరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే, నీటిని తోడేందుకు అనుమతులిచ్చిన నీటి పారుదల శాఖ అధికారికి తాజాగా ప్రభుత్వం భారీగా జరిమానా విధించింది. రూ.53 వేల మేర జరిమానా విధించింది.

కంకేర్ జిల్లాలోని కొలిబెడా బ్లాక్‌లో ఉన్న ఖేర్‌కట్టా డ్యామ్‌కు తన మిత్రులతో కలిసి ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్ గత ఆదివారం పిక్నిక్ వెళ్లాడు. అక్కడ డ్యామ్ వద్ద సెల్ఫీ దిగుతున్న సమయంలో తన చేతుల్లో ఉన్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఆ డ్యామ్‌లోని నీటిలో పడింది. రూ.లక్ష ఖరీదైన ఆ ఫోన్‌లో ప్రభుత్వ డేటా ఉండటంతో దాన్ని నీటిలో నుంచి వెలికి తీసేందుకు ముందుగా గజ ఈతగాళ్లను పంపారు. అయినా ఫోన్ జాడ దొరకక పోవడంతో నీటిని తోడించేశాడు.

Also Read: మహారాష్ట్రలో రైతులకు ఏటా రూ.6 వేల సాయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News