Wednesday, May 15, 2024

ఛాయ్ కోసం మిట్టికేఫ్‌కు చీఫ్‌ జస్టిస్ భార్య..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్థానిక సుప్రీంకోర్టు ఆవరణలోని ‘మిట్టికేఫ్‌కు ఆదివారం అనుకోని అతిధి వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ భార్య కల్పనా దేవి దాస్ ఈ కేఫ్‌కు రావడంతో ఇక్కడి సిబ్బంది ఉబ్బితబ్బిబయ్యింది. శ్రీమతి దాస్ అక్కడి సిబ్బందితో, టీ టిఫిన్లకు వచ్చిన వారితో కొద్ది సేపు మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అంతకు ముందు రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత నేరుగా కల్పనా దేవి ఈ కేఫ్‌కు వచ్చారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఈ మిట్టికేఫ్‌లు బహుళ ప్రచారం పొందాయి. తాను ఢిల్లీ వర్శిటీకి చెందిన ప్రతిష్టాత్మక హన్స్‌రాజ్ కాలేజీలో మిట్టికేఫ్‌ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ భార్య గుర్తు చేశారు. దివ్యాంగులు ఈ కేఫ్‌లను నిర్వహిస్తున్నారు. ఇవి క్రమేపీ ప్రజాదరణ పొందుతున్నాయి. సుప్రీంకోర్టు ఆవరణలోని ఈ కేఫ్‌ను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఇటీవలే ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కేఫ్‌లు 35 వరకూ ఉన్నాయి. వీటిలో ఒక్కటి బెంగళూరు ఎయిర్‌పోర్టులో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News