Tuesday, May 14, 2024

మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల విదేశీ చదువుల కోసం ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం ప్రవేశపెట్టింది. సోమవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద మైనారిటీ విద్యార్థులు యుఎస్‌ఏ. అస్ట్రేలియా, కేనడా, సింగపూర్, జర్మనీ, సౌత్ కోరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లోని విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పిహెచ్‌డీ కోర్సులలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చని తెలిపింది.

ఎంపికైన అభ్యర్థులు రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్, వాస్తవ రుసుము ఏది తక్కువైతే అది పొందేందుకు అర్హులు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు www.telanganaepass.cgg.gov.inలో అందుబాటులో ఉందని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీరవకు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్- కింద స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులందరూ గడువులోగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News