Friday, May 10, 2024

231 మంది ఖైదీలకు విముక్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వివిధ జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి విడుదల కానున్న వారిలో 212 మంది జీవితకాల ఖైదీలు కాగా.. ఇతర శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు 19 మంది ఉన్నారు.

భారత 75వగణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయం 231 మంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. క్షణికావేశాలకు లోనై నేరాలు చేసి, జీవితకాలంగా జైలులోనే మగ్గుతున్న వారిని విడుదల చేయాలని కోరుతూ పలువురు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఖైదీల కుటుంబ సభ్యులు కోరారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News