Friday, April 26, 2024

తల్లి కొట్టిందని ఇంట్లో నుంచి పారిపోయిన చిన్నారులు

- Advertisement -
- Advertisement -

అల్లాదుర్గంః కన్న తల్లిచిన్నారులను పదేపదే కొడుతుండటంతో కలత చెందిన పిల్లలు ఇల్లు విడిచి పారిపోవంతో రోడ్డు పక్కన పనిచేస్తున్న ఉపాది కూలీలు ఐసిడిఎస్ అధికారులకు అప్పజెప్పిన సంఘటన మండలంలోని కాగితంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఐసిడిఎస్ అధికారులు, చిన్నారుల కథనం ప్రకారం మండలంలోని సిల్వర్ గ్రామానికి చెందిన కర్రెల మొగులయ్య పాపమ్మ దంపతులకు ప్రియాంక, మధుప్రియ ఇద్దరు అమ్మాయిలు తండ్రి మొగులయ్య చనిపోవడంతో కొన్నాళ్లుగా తల్లి పాపమ్మ పెంచి పోషిస్తుంది.

భర్త చనిపోవడంతో మనోవేదనకు గురైన పాపమ్మ కొద్దిగా మతిస్థిమితం లేకపోవడంతో తరుచూ చిన్నారులను కొడుతుండటంతో బాధలు పడలేక పిల్లలు వారి బంధువుల దగ్గర తలదాచుకుంటున్నట్లు గ్రామస్థులు వివరించారు.గురువారం ఇంట్లో నుంచి పారిపోయి 161 జాతీయ రహదారిపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా అల్లాదుర్గం గ్రామానికి చెందిన కొంక శ్రీశైలం అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పిల్లలను వారి తల్లితండ్రులకు పోలీసులు అప్పగించారు. అయినా తీరుమారని తల్లిపిల్లలను మందలించడంతో మనస్థాపానికి గురైన పిల్లలు ఇంటినుంచి పారిపోయి రోడ్డుపై వెళ్తుండగా కాగితంపల్లి శివారులో ఉపాది కూలీలు పిల్లలను గమనించి చేరదీశారు.

చిరిగిపోయిన దుస్తులతో ఉన్న పిల్లలను గ్రామస్థులు కొత్త దుస్తులు అందించి ఐసిడిఎస్ అదికారులకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన ఐసిడిఎస్ ఇంచార్జీ వెంకటరమణమ్మ, సూపర్‌వైజర్ నాగమణి, చిన్నారుల వద్దకు చేరుకుని పిల్లలను పలు విధాలుగా నచ్చజెప్పిన పిల్లలు తల్లివద్దకు వెళ్లలేమని చెప్పడంతో డిసిపియుకు సమాచారం అందించగా అధికారి నాగరాజు సమక్షంలో మెదక్ కేంద్రంలో ఉన్న బాలసదనంకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News