Sunday, May 5, 2024

కరోనా మూలాల దర్యాప్తుకు చైనా అభ్యంతరం

- Advertisement -
- Advertisement -


బీజింగ్: కరోనావైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించాలనుకుంటున్న తాజా దర్యాప్తు ద్వారా  ‘రాజకీయంగా తారుమారు’(పొలిటికల్ మ్యానిపులేషన్)కు అవకాశం ఇవ్వడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం హెచ్చరించింది. వైరస్ మూలాలు పరిశోధించేందుకుగాను ప్రపంచ ఆరోగ్య సంస్థ 25 మంది నిపుణులను ప్రతిపాదించింది. వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహానిస్తారు.
2019 చివర్లో మానవుల్లో తొలిసారి కరోనావైరస్‌ను కనుగొనడం జరిగింది. చైనా తొలి కేసుల ముతక సమాచారం(రా డేటా)ను ఇవ్వలేదని ఆరోపణ ఉంది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జోవో లిజియాన్ “అంతర్జాతీయ శాస్త్ర దర్యాప్తునకు చైనా మద్దతునిస్తుంది. కానీ రాజకీయంగా తారుమారు చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. అన్ని పక్షాల వారు బాధ్యతాయుత శాస్త్రీయ ధోరణితో విలువలను కాపాడాలి” అన్నారు. ఆయన విలేకరులకు ఇచ్చే డెయిలీ బ్రీఫింగ్‌లో ఈ విషయాన్ని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య దర్యాప్తు బృందంలో ఇదివరకు కోవిడ్-19 మూలాలు పరిశోధించేందుకు వూహాన్ వెళ్లిన కొందరిని తిరిగి నియమించింది.
వైరస్ చైనాలోనే పుట్టిందా అని చైనా పదేపదే ప్రశ్నించింది. అమెరికా మిలిటరీ ప్రయోగశాలల్లో కూడా దర్యాప్తు జరపాలంది. చైనా కరోనా వైరస్ వ్యాప్తిని మాస్కులు ధరించడం, క్వారంటైన్ చేయడం, ఎలక్ట్రానిక్ కేస్ ట్రేసింగ్, లాక్‌డౌన్ వంటి కఠిన చర్యలు, అందరికీ పరీక్షలు తప్పనిసరి చేయడం ఇత్యాదుల ద్వారా నివారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News