Monday, May 6, 2024

డ్రాగన్ సరి‘హద్దు’లు మార్చే కుట్ర!

- Advertisement -
- Advertisement -

Chinese conspiracies to emerge in Galvan

 

గాల్వన్‌లో చైనా కుట్రలు వెలుగులోకి
రాయిటర్స్ ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సందేహాలకు మరింత బలం

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాల్వన్ లోయపై పట్టు సాధించేందుకు గాల్వన్ నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాయిటర్స్ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎర్త్- ఇమేజింగ్ కంపెనీ ప్లానెట్ ల్యాబ్స్ చిత్రీకరించిన ఫొటోలను షేర్ చేసిన రాయిటర్స్ గాల్వన్ లోయలో జూన్ 9, 16 తేదీల్లో చోటుచేసుకున్న పరిణామాలను విశ్లేషించింది. ఈ ఫొటోలను నిశితంగా పరిశీలించినట్లయితే హిమాలయ పర్వత ప్రాంతంలో కాలిబాట ఏర్పరిచిన డ్రాగన్ ఆర్మీ దాని గుండా డ్యామ్ నిర్మాణ సామాగ్రిని తరలించినట్లు కనిపిస్తోంది.

భారత భూభాగాన్ని ఆక్రమించే క్రమంలో వారం రోజులుగా దూకుడు పెంచిన చైనా ఆర్మీకి అడ్డుకట్ట వేసేందుకు భారత జవాన్లు ప్రయత్నించగా వారిని దొంగ దెబ్బ కొట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయం గురించి కాలిఫోర్నియా మిడిల్‌బరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్- ఈస్ట్ ఏషియా నాన్‌ప్రొలిఫెరేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ జెఫ్రీ లూయిస్ మాట్లాడుతూ ప్లానెట్ ల్యాబ్స్ ఫొటోలు చూసినట్లయితే గాల్వన్ లోయ వెంబడి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటుగా చైనా డ్యామ్ నిర్మిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. అదే విధంగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఆర్మీకి చెందిన 30- నుంచి 40 వాహనాలు ఉంటే చైనా వందకు మించి వాహనాలను అక్కడ నిలిపినట్లు స్పష్టమవుతోందన్నారు. సరిహద్దులు మార్చేందుకే డ్రాగన్ ఈ చర్యలకు పూనుకుందా అని అనుమానం వ్యక్తం చేశారు. కాగా భారత్ చైనాతో 4,056 కిలోమీటర్ల సరిహద్దు(సినో- ఇండియన్ బార్డర్) కలిగి ఉన్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News