Friday, May 10, 2024

గోగ్రా -హాట్‌స్ప్రింగ్ ప్రాంతంనుంచి వెనక్కి వెళ్లిన చైనా బలగాలు

- Advertisement -
- Advertisement -

Chinese forces retreated from Gogra-Hotspring area

అక్కడ నిర్మించిన భవనాన్ని కూడా కూల్చివేసిన డ్రాగన్
ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాలు

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని అధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాలనుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాలని ఇటీవల భారత్ చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. ఈ అంగీకారానికి అనుగుణంగా చైనా బలగాలు తూర్పు లడఖ్‌లోని గోగ్రాహాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు ఆవలి వైపున తాము ఆక్రమించుకున్న ప్రాంతాలనుంచి చైనా బలగాలు దాదాపు 3 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లినట్లు ఎన్డీ టీవీ సంపాదించిన తాజా ఉపగ్రహ చిత్రాలనుంచి స్పష్టమవుతోంది. ఇరు బలగాలు వెనక్కి తగ్గే ప్రక్రియలో భాగంగా ఈ ఉపసంహరణ జరిగింది. దీంతో 2020లో భారత సైన్యం గస్తీ నిర్వహిస్తూ ఉండిన ఈ ప్రాంతంనుంచి చైనా ఆర్మీకి చెందిన ఓ ప్రధాన బేస్ పూర్తిగా నిష్క్రమించినట్లయింది. శాటిలైట్ చిత్రాలను తీయడంలో స్పెషలిస్టులైన మాక్సార్ నుంచి ఎన్డీటీవీ సంపాదించిన ఈ చిత్రాల్లో వాస్తవాధీన రేఖకు ఆవలి వైపు చైనా బలగాల ఉపసంహరణకు ముందు, ఆ తర్వాతి దృశ్యాలు ఉన్నాయి. కానీ ‘నోమ్యాన్స్ ల్యాండ్’గా పిలవబడే ప్రాంతానికి సంబంధించిన చిత్రాలు లేవు.

పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే చర్యలో భాగంగా ఈ నో మ్యాన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఇరు బలగాలు కూడా గస్తీ నిర్వహించరాదని అంగీకారం కుదిరింది. చైనా బలగాలు వెనక్కి వెళ్లడానికి ముందు ఈ ఏడాది ఆగస్టు 12న తీసిన చిత్రాల్లో లడఖ్‌లో 2020లో చైనా చొరబాట్లు చోటు చేసుకోవడానికి ముందు భారత సైన్యాలు గస్తీ తిరుగుతూ ఉన్న ప్రాంతంలో చైనా ఓ పెద్ద భవనాన్ని నిర్మించి ఉన్నట్లు ఉంది. ఈ భవనం చుట్టూ కందకాలు లాంటివి ఉన్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. కాగా ఈ నెల 15 నాటి శాటిలైట్ చిత్రాల్లో చైనా ఈ భవనాన్ని కూల్చివేయడమే కాకుండా, నిర్మాణ శిథిలాలను ఆ ప్రాంతంనుంచి తరలించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు చైనా ఖాళీ చేసిన ప్రాంతంలోని భూమిని ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న దానికి అనుగుణంగా పూర్వ స్థితికి చదును చేసినట్లు మరో చిత్రంలో కనిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News