Sunday, April 28, 2024

కేరళ విజింజిం పోర్టుకు చేరిన మొదటి నౌక

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలో రూ.7,700 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విజింజిం ఓడ రేవుకు చైనా నుంచి మొట్టమొదటి నౌక వచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం జెండా ఊపి స్వాగతం పలికారు. పోర్టుకు ఈ భారీ ఓడ చేరుకోగానే స్వాగత సూచకంగా బాణాసంచా కాల్చారు. బెలూన్లు విడిచిపెట్టారు. జెన్ హువా 15 పేరు గల ఈ భారీ నౌక ఆగస్టులో చైనా నుంచి తన ప్రయాణం ప్రారంభించింది. విజింజిం రేవుకు ఈనెల 4న చేరుకోవలసి ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆలస్యంగా చేరింది.

ఈ పోర్టు 2019 నాటికే ప్రారంభం కావలసి ఉండగా, భూసేకరణ తదితర సమస్యల కారణంగా ఆలస్యమైంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణమైన ఈ పోర్టుకు అదానీ గ్రూప్ ప్రైవేట్ భాగస్వామిగా పాలుపంచుకుంది. అసెంబ్లీలో విపక్ష నేత విడి సతీశన్, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్, కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News