Wednesday, May 1, 2024

చంద్రుడిపై విజయవంతంగా దిగిన చైనా వ్యోమనౌక

- Advertisement -
- Advertisement -

Chinese spacecraft successfully landed on Moon

 

బీజింగ్: చైనా ప్రయోగించిన మానవ రహిత వ్యోమనౌక మంగళవారం చంద్రు డి ఉపరితలంపై విజయవంతంగా దిగిందని అధికార వార్తాసంస్థ ‘జిన్హువా’ తెలిపింది. మంగళవారం పొద్దుపోయాక చాంగే5 వ్యోమనౌక చంద్రుడిపై భూమి కి దగ్గరి వైపున దిగినట్లు చైనా జాతీయ రోదసీ సంస్థను ఉటంకిస్తూ ఆ వార్తాసంస్థ తెలిపింది. 2022 నాటికి సిబ్బందితో కూడిన స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటుగా మనుషులను చంద్రుడికి పంపగలమన్న అంచనాలతో చైనా సైన్యం ఆధ్వర్యంలో జరుగుతున్న అంతరిక్ష కార్యక్రమాల కోసం కోట్లా ది డాలర్లు ఖర్చుచేస్తోంది. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేయడంకోసం చంద్రుడి శిలలను భూమికి తీసుకు రావడం చైనా తాజాగా ప్రయోగించిన వ్యోమనౌక లక్షం. చంద్రుడి ఉపరితలంపై ఇప్పటివరకు అన్వేషణ జరపని ‘ఓషన్ ఆఫ్ స్టార్మ్’గా పిలవబడే ప్రాంతంలో దాదాపు 2 కిలోల మెటీరియల్ ను ఈ చాంగే5 వ్యోమనౌక సేకరిస్తుందని సౌన్స్ జర్నల్ నేచర్ తెలిపింది. అక్క డ విశాలమైన లావా మైదానం ఉంది. ఒక చంద్రుడి రోజు అంటే దాదాపు 14 భూమి రోజుల సమయంలో అది ఈ మెటీరియల్‌ను సేకరిస్తుంది. ఈ శాంపిల్స్‌ను క్యాప్సైల్ రూపంలో భూమికి తీసుకువస్తుంది. డిసెంబర్ నెల ప్రారంభం లో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో అది ల్యాండ్ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News