Monday, May 13, 2024

చిట్టెంపాడు పాఠశాల అమ్మకాలపై మీనమేషాలు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 2లో స్థల దాత కీర్తి శేషులు ముమ్మడి రామిరెడ్డి ప్రాథమిక పఠశాల భవన నిర్మాణానికి 20 గుంటల సొంతభూమిని పాఠశాల భవన నిర్మాణం కోసం అందజేశారు. ఆ స్థలంలో ప్రభుత్వ నిధులతో పాఠశాలను నిర్మించారు. అదే స్థలంలో అదనపు గది నిర్మాణం కోసం బేస్మెంట్ నిర్మించారు. గ్రామానికి కమ్యూనిటీ హాల్ మంజూరు కావడంతో ఆ భవనాన్ని సైతం ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి పక్కన పాఠశాల భవన స్థల ఆవరణలో నిర్మించారు. జనవరి 5,199లో పాఠశాల భవన ప్రారంభోత్సవం జరిగింది.

మునుగోడు పంచాయతీ రాజ్ ఎస్టిమేషన్ బిల్డింగ్ నిర్మాణం బిల్లులు విడుదల చేశారు. ఆ పాఠశాల భవనం అన్యాక్రాంతం అవుతున్నా ప్రజా ప్రతినిధులు అధికారులు తమకు ఏమి పట్టనట్లు అశ్రద్ద వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలో పెంట కుప్పలు పోస్తున్నా విద్యాశాఖ మొద్దు నిద్రలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం మండల పరిషత్ ఎన్నికలు కా గానే ప్రజా ప్రతినిధులు ఎంతో హడావుడి చేసి పాఠశాలను సందర్శించి తగిన నిధులు కేటాయించి మరమ్మత్తులు, అదనపు గదులు నిర్మించి అందుబాటులోకి తెస్తామని హా మీలు ఇచ్చిన ప్రజా ప్రతినిధులు, అందుకు వంతపాడిన అధికారులు తమ మాట నిల బెట్టుకోవడం మర్చిపోవడంతో పాఠశాల భవనం అంగట్లో సరుకుగా అమ్ముడు పో వడానికి సిద్ధ్దంకాగా , అదనపు గది బేస్మెంటును తొలగించారు. ఇక భవనం మాత్రం మిగి లింది.

దానిని సైతం కూల్చడానికి సిద్ధ్దంగా ఉన్నారు. చిట్టెంపాడు గ్రామ చింతపల్లి బ్లాక్ స్థాయి తోళ్ల పరిశ్రమ భవనాన్ని రాత్రి సమయంలో కూల్చి కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా చేసిన సంఘటన మర్చిపోకుండానే పాఠశాల భవనం సైతం కూల్చివేతకు చేరు వలో ఉన్నట్లు తెలిసింది. భవన స్థలాన్ని సైతం గ్రామస్తులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. పాఠశాల స్థల దాత వారసులు భవన స్థలాన్ని రూ. 30 లక్షలకు బేరం పెట్టినట్లు తెలిసింది.విద్యాశాఖ అధికారులు స్థలం అమ్మకందారులతో కుమ్మక్కై భవనాన్ని,స్థలాన్ని కాపాడడానికి శ్రద్ద చూపడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News