Thursday, May 2, 2024

మరో రెండు టీకాలు

- Advertisement -
- Advertisement -

Cipmolnu 200 mg tablets for treatment of covid

కొవొవాక్స్, కార్బివాక్స్ వ్యాక్సిన్లకు కేంద్రం పచ్చజెండా
కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి మోల్నుపిరావిర్
మాత్రకు అనుమతి, త్వరలో ఫార్మా దిగ్గజం ‘సిప్లా’ మాత్ర?

న్యూఢిల్లీ : కరోనాపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తూ భారత్ మరో రెండు టీకాలను ఆమోదించింది. కొవొవ్యాక్స్, కార్బివాక్స్ టీకాలను అత్యవసర వినియోగం కింద ఆమోదించింది. అలాగే యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్‌ను అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినియోగించేలా అనుమతులు మంజూరు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ’(పుణె) తయారు చేసిన కొవొవాక్స్, బయోలాజికల్ ఇ తయారు చేసిన కార్బివాక్స్‌కు అనుమతులు ంజూరు చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్త (సీడీఎస్‌సీవొ) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు కేంద్రం వాటి వినియోగానికి అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరు లోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది.

బ్రిటన్, అమెరికాల్లో ఈ టీకాపై చేపట్టిన 2,3 దశల క్లినికల్ పరీక్షల ఫలితాల డేటాను జతచేసింది. ఈ క్రమం లోనే సీడీఎస్‌సీవొ నిపుణుల బృందం దీన్ని పరిశీలించి , అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయవచ్చని సోమవారం సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బివాక్స్‌కు అనుమతినిచ్చింది. కొవిడ్ వ్యాధికి మోల్నుపిరవిర్ ఔషధం అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతించింది. మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరఫ్యూటిక్స్ సంయుక్తంగా ఈ యాంటీ వైరల్ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. ఇప్పుడు భారత్‌లో ఈ ఔషధాన్ని 13 సంస్థలు తయారు చేస్తాయని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌తో బాధపడుతున్న వయోజనులు, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వినియోగిస్తారని తెలిపారు.

కొవిడ్ చికిత్సకు త్వరలో సిప్‌మొల్ను మాత్రలు

ముంబైకు చెందిన ఫార్మా దిగ్గజం సిప్లా త్వరలో కొవిడ్ చికిత్స కోసం సిప్‌మొల్ను 200 ఎంజి మాత్రలను తయారు చేయనున్నట్టు , ఇవి దేశం మొత్తం మీద అన్ని పార్మసీ సంస్థల వద్ద, కొవిడ్ చికిత్సా కేంద్రాల వద్ద లభిస్తాయని వెల్లడించింది. ఉత్పత్తి చేసే సామర్ధంతోపాటు పంపిణీ వ్యవస్థ కూడా తమకు పటిష్టంగా ఉన్నట్టు సిప్లా తెలియచేసింది. కొవిడ్ చికిత్సకు యాంటీ వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్‌ను మంగళవారం ఆవిష్కరించడం కొవిడ్ చికిత్సకు అనుసంధానంలో ఒక ముందడుగుగా అభివర్ణించింది. ప్రపంచ వ్యాప్తంగా రోగుల అవసరాలను తీర్చేందుకు తాము ముందున్నట్టు సిప్లా ఎండి, గ్లోబల్ సిఇఒ యుమాంగ్ వోహ్రా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో సిప్లా మెర్క్ షార్పె డోహ్మే (ఎంఎస్‌డి) సంస్థతో కలిసి మోల్నుపిరవిర్ తయారు చేసి భారత్ లోను, మిగతా స్వల్పాదాయ, మధ్యాదాయ 100 దేశాల్లో సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అత్యవసర వినియోగానికి ఈ మోల్నుపిరవిర్‌ను వాడేందుకు డిసిజిఐ నుంచి అనుమతి పొందినట్టు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News